ప్రాంతీయం

వ్యాక్సినేషన్ కార్యక్రమాల పైన టీకాలు వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన

22 Views

వ్యాక్సినేషన్ కార్యక్రమాల పైన టీకాలు వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన.

మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం.

మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఈరోజు జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు కేజీబీవీ జైపూర్ ను సందర్శించి జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ముస్తఫా తో కలిసి వ్యాక్సినేషన్ కార్యక్రమాల పైన టీకాలు వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం జరిగినది అదేవిధంగా 100% గర్భవతుల నమోదు టీకాలు ఇవ్వడం వాక్సినేషన్ విలువలను ఉంచుకొనడం వ్యాక్సిన్ తగు టెంపరేచర్ లో నిలువ చేయడము వ్యాక్సిన్ క్యారియర్ను తీసుకు వెళ్లేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఐఎల్ఆర్ డీఫ్రిజిల ఉపయోగము మరియు తీసుకునే పిల్లల వివరములను యూవిన్ పోర్టల్ లో అప్లోడ్ చేయడము జాతీయ కార్యక్రమాలు వాటి ప్రాముఖ్యతను వాటి టార్గెట్లను సమీక్ష చేయడం జరిగినది అదేవిధంగా జైపూర్ కేజీబీవీ పాఠశాలను సందర్శించి పనిబా ప్రిన్సిపల్ గారితో కలిసి పిల్లలకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలో కేజీబీవీలు ఆడపిల్లలు రక్తహీనత పడకుండా తగు పౌష్టికారాన్ని ప్రభుత్వం అందించే పౌష్టికారాన్ని సక్రమంగా తీసుకోవాలని ఆర్ బి ఎస్ కే వైద్యులు వైద్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఆరోగ్య ఆశా కార్యకర్తలు సందర్శించాలని ఆదేశించారు అదేవిధంగా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకొనడం చేతులను శుభ్రంగా కడుక్కునడము వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడము అదేవిధంగా మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు సబ్బుతో కడుక్కునడము అదేవిధంగా దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరినారు పాఠశాలలో పరిశుభ్రత వాతావరణం అని మరియు చుట్టుపక్కల ఆహార పదార్థాలను పడవేయరాదని శుభ్రంగా ఉంచుకోవాలని మరియు రక్తహీనత పడకుండా వైద్యులు సూచించిన మందులు వాడాలని మలేరియా డెంగ్యూ చికెన్ గునియా లాంటివి జ్వరాలు దోమలు కుట్టడం ద్వారా వస్తున్నందున దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు వంట చేసే ప్రాంతంలో శుభ్రంగా మరియు ఆహార పదార్థాలను నిలువలను సక్రమంగా ఉంచుకోవాలి ముఖ్యంగా కోడిగుడ్లు ఇతరః మాంస ఆహార పదార్థాలు మండేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మంచినీటిని త్రాగే నీటిని మాత్రమే వంట కోసం ఉపయోగించాలి మంట పాత్రలు మరియు మంట సామాగ్రిని శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలి వంటలు చేసేవారు శుభ్రత ఉన్నచో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటది కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినారు అదేవిధంగా జిల్లాలో ఈ కార్యక్రమాలను అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారికి ఆదేశించినారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ ముస్తఫా, వైద్యులు, వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు, లెక్చరర్లు జైపూర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పనిబా పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *