ప్రాంతీయం

బాలికల,మహిళల రక్షణపై అవగాహన కల్పించిన షీ టీమ్

18 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*బాలికల,మహిళల రక్షణపై అవగాహన కల్పించిన షీ టీమ్*

*ధైర్యంగా ఫీర్యాదు చేయండి… షీ టీమ్ మీకు అండ గా ఉంది: షీ టీమ్ ఎస్ ఐ ఉషారాణి*

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని రెవెలేషన్ పాఠశాలలో ఈరోజు మంచిర్యాల షీ టీమ్ ఎస్ ఐ ఉషారాణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా భద్రత, బాలికల రక్షణ, వేధింపుల నివారణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, ఈవ్ టిజింగ్, సోషల్ మీడియాలో వేదింపులు, అసభ్య ప్రవర్తనలు వంటి ఘటనలను అరికట్టేందుకు షీ టీమ్ పోలీసులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు. అత్యవసర సమయం లి డయాల్ 100/112, 181 మహిళా హెల్ప్ లైన్ నెంబర్లను విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు. పాఠశాల నుండి ఇంటికి వెళ్లే మార్గంలో ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు, వేధింపులు ఎదురైతే వెంటనే రామగుండం కమీషనరేట్ షీ టీమ్కు నెంబర్ 6303823700, మంచిర్యాల షీ టీమ్ నెంబర్ 8712659385 సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు తెలిపారు. సైబర్ వేధింపులపై బాధపడుతున్న బాలికలు తమ ఫిర్యాదులను పోలీసులకు తెలియజేయాలని, అన్ని రకాల ఫిర్యాదులను గోప్యంగా స్వీకరిస్తామని భరోసా కల్పించారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు అంగీకరించ కూడదని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. బాలికల భద్రత కోసం రామగుండం కమీషనరేట్ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీలో ధైర్యం, అవగాహన పెంపు మా ప్రధాన లక్ష్యం. ఏ సమస్య అయినా వెంటనే పోలీసులకు తెలియజేయండి అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షి టీమ్ ఇంచార్జి ఎస్.ఐ. ఉషారాణి ,షి టీమ్ సిబ్బంది కానిస్టేబుల్ సతీష్, మహిళా కానిస్టేబుళ్లు శ్రీలత,శైలజ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, కరస్పాండెంట్ విష్ణువర్ధన్,స్కూల్ టీచర్లు మరియు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *