ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని వెంకటాపూర్ గ్రామ శివారులో గల పేదల భూమిని ప్రభుత్వం ఆక్రమించ వద్దని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆదివారం తెలిపారు కొన్ని సంవత్సరాల పాటు గా పేద రైతులు ప్రభుత్వ భూమితో పాటు పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు భూమి సర్వే నంబర్లు247 149. 375. 408 126 సర్వే నంబర్ల భూమిలో సుమారు 100 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు ఇప్పటికే ప్రభుత్వ భూమిని పార్కు కు పోలీస్ అకాడమీకి ఇవ్వడం జరిగింది మిగిలిన కొద్ది భూమిలో అధికార పార్టీ నాయకులు ఆ భూమి ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని కానీ మంత్రి కేటీఆర్కు ఈ భూ వివాదం మంత్రి మెడకు చుట్టుకుంటుంది మంత్రి కల్పించుకుని ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులకు సర్దిచెప్పి ఇన్ని సంవత్సరాలుగా ఆ భూమిని సేద్యం చేసుకుంటున్న రైతులకు అట్టి భూమిని అప్పగించి పట్టాలు ఇవ్వాలన్నారు బాధితుల కోసం కాంగ్రెస్ పార్టీ అండ గా పోరాటం చేస్తుందని అన్నారు




