ప్రాంతీయం

టెక్స్టైల్ పార్క్ కార్మికులకు 15 రోజుల వరకు యారన్, సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్,

135 Views

తంగళ్ళపల్లి మండల టెక్స్ టైల్ పార్కులో పవర్లూమ్ కార్మికులకు రావలసిన 2020 – 2021 సంవత్సరాల 10 % యారన్ సబ్సిడీ కొరకు కార్మికుల ఉత్పత్తి వివరాలను యజమానుల నుండి వెంటనే తెప్పించుకొని 15 రోజుల వరకు సబ్సిడీ డబ్బులను కార్మికులకు అఅందించాలనే డిమాండ్ తో టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కు గేటు ముందు నిరసన కార్యక్రమం చేపట్టి ఏడి గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ గార్లు మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు 2019 సంవత్సరంలో కూలి పెంచాలని సమ్మె చేసిన సందర్భంగా కూలి పెంచడం సాధ్యం కాదని కూలీ సర్దుబాటు పేరుతో 10 శాతం యారన్ సబ్సిడీని అందిస్తామని ప్రకటించడం జరిగిందన్నారు కానీ సబ్సిడీ అందించడంలో అధికారులు చాలా కాలయాపన చేస్తున్నారని ప్రస్తుతం 2022 సంవత్సరం బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తయిన కూడా కార్మికులకు మాత్రం 2019 వరకే సబ్సిడీ అందించడం జరిగిందని ఇంకా 2020 – 2021 సంవత్సరాల కు సంబంధించిన సబ్సిడీ పెండింగ్ లో ఉందన్నారు 2019 సంవత్సరం సబ్సిడీ డబ్బులు కార్మికులకు సంబంధించి మూడు నెలలు అవుతుందని అయినా ఇప్పటికీ 2020 – 2021 సంవత్సరాల కార్మికుల ఉత్పత్తి వివరాలను యజమానుల నుండి ఇంతవరకు తీసుకోలేదన్నారు టెక్స్టైల్ పార్కులో కొన్ని పరిశ్రమలు మూతపడి పవర్ లూమ్స్ తరలిపోవడం జరిగిందని మూతపడిన పరిశ్రమలలో పనిచేసిన కార్మికుల ఉత్పత్తి వివరాలు ఆ యజమానులు అందించకుంటే ఆ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు సబ్సిడీ నష్టపోయే అవకాశం ఉంటుంది కావున ఇప్పటికైనా అధికారులు వెంటనే యజమానుల నుండి పూర్తిస్థాయిలో కార్మికుల ఉత్పత్తి వివరాలను తెప్పించుకొని 15 రోజుల వరకు 2020 – 2021 సంవత్సరాల సబ్సిడీ డబ్బులను కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో జెల్ల సదానందం , రాచర్ల వేణు , దూడం సంపత్ , కందికట్ల శ్రీనివాస్ , వరప్రసాద్ , నాగరాజు , భాస్కర్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7