గజ్వేల్,మర్కుక్,మే,02
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రం గ్రామ పురోహితులు బ్రహ్మ శ్రీ అప్పాల మాధవ శర్మ,దేశాయి కార్తిక్ శర్మ శ్రీ మహాలింగార్చన సేవా పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ మహా రుద్ర యాగం కాశీలో నిర్వహించారు.లోక కళ్యాణాన్ని కోరుకుంటూ జగత్ కళ్యాణ కారకుడైన శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుడి సన్నిధిలో శ్రీశ్రీశ్రీ భావానంద భారతి స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులతో శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహముతో శ్రీ మహా రుద్ర యాగం కార్యక్రమాన్ని 2వ తేదీ మే గురువారము ప్రారంభించినారు.ఈ కార్యక్రమము 6వ తేదీ మే సోమవారం వరకు ఐదు రోజులు వరకు నిర్వహించబడునని గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ అప్పాల మాధవ శర్మ,దేశాయి కార్తిక్ శర్మ తెలిపినారు.ఇంతటి మహదవకాశాన్ని తమకు ప్రసాదించినందుకు ఆ కాశీ విశ్వేశ్వరుడిని లోకాన్ని చల్లగా చూడమని ప్రార్థించినారు.
