ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ.
న్యూయార్క్, అక్టోబర్ 2025:
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల (United Nations General Assembly) కోసం అమెరికా పర్యటనలో ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ , న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీ కృష్ణ మాట్లాడుతూ – “అహింస, శాంతి, సత్యం అనే విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహాత్మా గాంధీ ఆలోచనలు నేటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకాలు” అని పేర్కొన్నారు. భారతదేశ ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితిలో పాల్గొనడం గర్వకారణమని, దేశం కోసం పని చేసే దిశగా తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ ప్రతినిధులు మరియు ప్రవాస భారతీయులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి, గౌరవభావాలతో నిర్వహించబడింది.





