బయట దేశాలకు పంపిస్తానని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్ఐ మహేష్ తెలిపారు.గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన రాములు అనే వ్యక్తి వద్ద రుద్రంగి గ్రామానికి చెందిన దూస శ్రీనివాస్ అనే వ్యక్తి మలేషియా పంపిస్తానని 95 వేల రూపాయలు తీసుకున్నాడు.రాములు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తప్పించుకుని తిరుగుతున్న శ్రీనివాసును శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్సై తెలిపారు.




