గోవుల రక్షణ చట్టాలు అమలు చేయాలని వినతి పత్రం అందజేత
గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి
మూగజీల సేవా సంఘం మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు గోవధ గోరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన. మంచిర్యాల జిల్లా మూగజీవుల సేవా సంఘం సభ్యులు మూగజీవుల సేవా సంఘం అధ్యక్షుడు కటుకం నాగరాజు కమిటీ సభ్యులతో కలిసి గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.
అనంతరం కటుకం నాగరాజు మాట్లాడుతూ గోవులను అన్యాక్రాంతంగా తరలించే వారిపట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా జిల్లాలో అనేకచోట్ల అనుమతి లేకుండా నిర్వహించబడుతున్న కబేళాలను మూసివేసేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1977 సం”లో గోవధ నిషేధ చట్టం తీసుకొచ్చినప్పటికిని పూర్తి స్థాయిలో అమలు కావడంలేదన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుండి పెద్ద మొత్తంలో ఎటువంటి అనుమతులు లేకుండా కంటేనర్,లారీలు వంటి వాహనాలలో గోవులను అతికిరాతకంగా హింసకు గురిచేస్తూ పరిమితికి మించి కదలలేని స్థితిలో బాధకు గురిచేస్తూ యదేచ్ఛగా హైదరాబాద్ లోని కబేళాలకు రవాణా చేయడం జరుగుతుందన్నారు.హిందువుల ఆరాధ్యదైవం ముప్పై మూడు కోట్ల దేవతల నిలయంగా పూజించే గోవులను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని గుర్తుచేసారు.
ఇప్పటికైనా గోవుల అక్రమ రవాణా జరుగకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో మూగజీవుల సేవా సంఘం అధ్యక్షుడు కటుకం నాగరాజు, ఉపాధ్యక్షుడు మర్రి స్వామి, విశ్వహిందూ పరిషత్ మంచిర్యాల జిల్లా గోరక్షక్ ప్రముఖ్ రాజసమ్మయ్య,వేముల హరిప్రసాద్, తోట కార్తీక్,శ్రీధర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





