ప్రాంతీయం

వడ్డేపల్లి గ్రామానికి నిధులు మంజూరు చేయండి.

20 Views

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న వివిధ సమస్యలను గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి కావలసిన అభివృద్ధి నిధుల గురించి ఆయనతో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ సంక్రాంతి అనంతరం వడ్డేపల్లి గ్రామానికి వచ్చి గ్రామానికి అవసరమైన నిధులు, అభివృద్ధి పనులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వడ్డేపల్లి గ్రామ ప్రజల తరఫున, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు ఎంపీ రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *