ముస్తాబాద్ (ప్రతినిధి) జనవరి 3, ఈరోజు స్థానిక శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాలలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇన్చార్జి ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ సావిత్రి జ్యోతి బాయ్ పూలే గారి 192 వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పేద బడుగు బలహీన వర్గాల మహిళలకు విద్యార్థులకు అనేక పాఠశాలలు ఏర్పాటు చేశారని ఏర్పాటు చేసి విద్యాబుద్ధులు నేర్పారని విద్యార్థిని విద్యార్థుల సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ మరియు బాలికల హాస్టల్ ఇన్చార్జ్ కొమ్మాట సౌమ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి అక్షిత, విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.




