జామే మసీద్ నూతన కార్యవర్గం ఎంపిక
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఖాదీమ్ జామే మసీద్ నూతన కార్యవర్గాన్ని శనివారం రాత్రి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సయ్యద్ జహంగీర్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ లాల్ మహమ్మద్, మహమ్మద్ బాబా, కోశాధికారిగా మహమ్మద్ అహమద్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ వాజిద్, సహాయ కార్యదర్శిగా మహమ్మద్ తాజుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా సాదుల్ ఖురైషి, సయ్యద్ తాజుద్దీన్ , మహమ్మద్ ఇర్ఫాన్, షేక్ తాజ్, మహమ్మద్ రఫీక్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎంపికైన కార్యవర్గాన్ని కుల పెద్దలు డాక్టర్ అహ్మద్, జిల్లా కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, మహమ్మద్ రఫీకుర్ రహ్మాన్, మహమ్మద్ జాఫర్ లు ఘనంగా సన్మానించి అభినందించారు.
