వర్గల్ మండల కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్

గ్రామ సర్పంచులకు మద్దతుగా ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి బయలుదేరిన వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులని అక్రమ అరెస్ట్ చేసి గౌరారం పోలీస్ స్టేషన్ కి తరలించారు..అక్రమ అరెస్ట్ లతో బిఆర్ స్ ప్రభుత్వం ప్రజాస్వామ్యన్నీ ఖుని చేస్తున్నది అని,సర్పంచులకు చెల్లించాలిన ,బిల్లులని కూడా బి ఆర్ స్ ప్రభుత్వం మింగేసిందని , అతి తొందరలో ఈ ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్ నాయకులూ సూచించారు..
అరెస్ట్ అయిన వారిలో వర్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి ,వర్గల్ ఉపసర్పంచ్ రమేష్ ,కాంగ్రెస్ నాయకులూ ,చంద్రారెడ్డి ,సల్మాన్ ,రవి ,బాలకృష్ణ రెడ్డి ,గణేష్ ,కనకయ్య ,బిక్షపతి ,మహేష్ ,తదితరులు ఉన్నారు




