– సీఐ ఇంద్రసేనారెడ్డి..
(కరీంనగర్ జిల్లా గన్నేరువరం సెప్టెంబర్ 13 )
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అన్ని పార్టీల నాయకులు శాంతి భద్రతులకు సహకరించాలని తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆదేశించారు. గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గన్నేరువరం ఎస్సై చందా నరసింహారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన అల్ పార్టీ నాయకుల సమావేశానికి తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి నాయకుడు తమ మనోభావాన్ని వ్యక్తపరిచేందుకు పోలీసులు అనుమతి కల్పించారు. పలువురు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ.. అన్ని పార్టీలకు చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. గుండ్లపల్లిలో పొలాలు, దుకాణం వద్దకు హెల్మెట్ లేకుండా వెళ్లడంతో పోలీసులు ఫోటోలు తీస్తున్నారని.. దీని కారణంగా గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజీవ్ రహదారిలో ఫోటోలు తీసేలా తమకు పోలీసులు సహకరించాలని కోరారు.
అనంతరం సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ..
ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఏలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలనే విభేదం లేకుండా లా అండ్ ఆర్డర్ ప్రకారమే పోలీసు యంత్రం పనిచేస్తుందని తెలిపారు.