ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకట్ రెడ్డి జనవరి 1, సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) నూతన పాలకవర్గం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో పదవుల కేటాయింపుల్లో సముచిత స్థానం చిక్కాల రామారావుకి లభించింది. ఇదివరకే చైర్మన్‌గా పనిచేసిన అనుభవమున్న చిక్కాల రామారావుకే మరోసారి అవకాశం కల్పించగా, సెస్ చైర్మన్గా విజయం సాధించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామితో పాటు రామ్మోహన్ రావు, అంజాన్ రావు, దమ్మ రవీందర్ రెడ్డి, వేణు, కలకొండ కిషన్ రావు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
