ముస్తాబాద్ జనవరి 01, ముస్తాబాద్ అంచలంచెలుగా ముందుకు దూసుకెళ్తున్న సింగపూర్ ఎన్నారై ఏళ్ళరాంరెడ్డి నూతనంగా సెస్ డైరెక్టర్ గా ఎన్నికై విజయం సాధించిన సందుపట్ల అంజిరెడ్డిని ఈరోజు శాలువాతో సత్కరించి భగవతగీత బుక్ ని అందించారు. ఈసందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని రైతులకి ఎప్పటికప్పుడు సహాయపడుతూ వారి వారి విద్యుత్ సమస్యలు తీర్చుతూ వాళ్ళకి తోడుగా ఉండాలని కోరారు , ఈకార్యక్రమం లో సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి , బంధనకల్ రెడ్డి సంఘం ఉపాధ్యక్షుడు కస్తూరి శ్రీనివాస్ రెడ్డి , ఈర్ల శ్రీనివాస్ , పదిరే రాజాగౌడ్ , ప్రభులింగం రామ్మోహన్ సర్ , సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కలకొండ కిషన్ రావు, అంజి తదితరులు పాల్గున్నారు.
