– భద్రాచలంకు గోటి తలంబ్రాలను అందించిన ఘనత రామకోటి రామరాజుదే
– రామకోటి రామరాజు కృషి అమోఘమని గ్రామస్తుల సన్మానం
– కల్యాణ తలంబ్రాలు కళ్లారా చూసే భాగ్యం కలగడం మా గ్రామస్తుల అదృష్టం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం చేస్తున్న సేవకు గాను 100కిలోల ముత్యాల తలంబ్రాలను భద్రాచల దేవస్థానం అందించింది. వీటిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది భక్తులే లక్ష్యంగా పంపిణి చేస్తున్నారు. శనివారం నాడు దుబ్బాక మండలం ధర్మాజిపేట్ గ్రామస్తులకు ఋషి విద్యాలయం వద్ద ముత్యాల తలంబ్రాల విశిష్టత తెలియజేసి భక్తులకు అందజేసిన రామకోటి సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇక్కడి గ్రామస్తులందరు కూడ పెద్ద ఎత్తుల రామనామాన్ని స్మరిస్తూ గోటితో ఒడ్లను ఓలిచి భద్రాచల కల్యాణనికి అందించారు. వారి రామభక్తి అమోఘం అన్నారు. అందుకే తిరిగి వారికీ కల్యాణ ముత్యాల తలంబ్రాలు అందిస్తునన్నారు. ఈ సందర్బంగా తలంబ్రాలు అందుకున్న భక్తులు మాట్లాడుతూ రామకోటి రామరాజు కృషి, పట్టుదల వల్ల మా గ్రామానికి మొదటి సారిగా ముత్యాల తలంబ్రాలు రావడం మా అదృష్టం అన్నారు. రామకోటి రామరాజును కృషి, పట్టుదలకు గాను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం ఋషి విద్యాలయ ఋషి విద్యాలయం కరస్పండెండ్ కారంపురి రవి పాల్గొన్నారు.





