ప్రాంతీయం

శ్రీ రుక్మిణి వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం…

49 Views

ముస్తాబాద్, ఫిబ్రవరి1 (24/7న్యూస్ ప్రతినిధి) నేడు ఆదివారం ఉదయం11.గంటల నుండి కళ్యాణ మహోత్సవం తీర్థ ప్రసాద వితరణ అనంతరం ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి కృపకు ఆస్వామి కరుణా వీక్షణకు హాజరు కావలసిందిగా భక్తజన బృందం శ్రీ శృంగేరి శంకరమఠము శాఖ వాసుదేవాశ్రమము గ్రామము బంధనకల్ మండలం ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లావారు ఆహ్వానించుచున్నారు. శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీ దేవిల పవిత్ర వివాహాన్ని స్మరించుకునే అత్యంత పవిత్రమైన వేడుక. భీష్మక రాజు కుమార్తె రుక్మిణి, శ్రీకృష్ణుడిని ఇష్టపడి తనను వివాహం చేసుకోవాలని కోరుతూ రాసిన లేఖ ఆధారంగా, కృష్ణుడు ఆమెను అపహరించి ద్వారకలో వేద మంత్రాల నడుమ వివాహం చేసుకున్నాడు. ఇది ప్రేమ, భక్తి దైవిక సంకల్పానికి ప్రతీక… ఈకళ్యాణాన్ని చదవడం లేదా వినడం వల్ల వివాహంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని, భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని ప్రగాఢనమ్మకం ఉంటుందన్నారు.

No Slide Found In Slider.

Poll not found
కస్తూరి వెంకటరెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్ 9618419111

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *