ప్రాంతీయం

సింగరేణిలో పని దొంగలను పెంచి పోషిస్తారా!

99 Views

పనిచేసే కార్మికులపై నిర్బంధం అమలు చేస్తారా! పని దొంగలను పెంచి పోషిస్తార!

జూన్ 19

సింగరేణి సంస్థలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల పేరుతో మస్టర్డ్లు పడి కాలం గడుపుతున్న వాళ్ళని వదిలేసి సంస్థ రక్షణ కోసం అభివృద్ధి కోసం కుటుంబాలను సాదుకోవటానికి అంకిత భావంతో పనిచేస్తున్న సామాన్య కార్మికులపై నిర్బంధాన్ని అమలు చేసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల పేరుతో కొంతమందిని ఫ్రీ మస్టర్లు ఇస్తూ పెంచి పోషించే సింగరేణి యాజమాన్యం మరోసారి సంస్కరణల పేరుతో కార్మికుల మీద నిర్బంధాన్ని ప్రయోగించే ప్రయత్నాన్ని ముందుకు తీసుకొస్తుంది సింగరేణి ఎన్నికల విధానం మొదలైన తర్వాత కొంతమంది సోమరిపోతులను పెంచి పోషిస్తూ గనుల్లో దిగటానికి ఆసక్తి చూపని అధికారులు వీళ్ళ మీద కార్మిక సంఘాల వత్తిడి ఉండకూడదని కొంతమందికి ఫ్రీ మస్టర్లు ఇస్తూ సింగరేణిని నష్టపరుస్తున్న సంగతి జగమెరిగిన సత్యమే సంస్కరణల పేరు మీద పనిచేసే కార్మికుల్ని వేధించడం కోసం కొత్త కొత్త సర్కులర్లను జారీ చేయడం సక్రమంగా విధులు నిర్వహిస్తున్న కార్మికులను భయభ్రాంతులకు గురి చేయటానికి వేంపుకు తినడానికి ఇలాంటి సర్కులర్లు పనికొస్తాయి తప్ప సోమరిపోతులను పని తప్పించుకో తిరగడం కోసం పనిచేసే కార్మికుల మీద చాడీలు చెప్పుతూ ఫ్రీ మస్టర్లు పొందుతున్న కొంతమంది జలసారాయుళ్లను పెంచి పోషించడం మాత్రం ఆగదనేది జగమెరిగిన సత్యమే ఎన్ని సర్కులర్లు జారీ చేసిన పని దొంగలను నివారించే చర్యలు మాత్రం అమలు కావు ఎందుకంటే కొంతమంది అధికారులు రెండవ బదిలీ మూడవ బదిలీలలో గనులలోకి దిగకుండానే వారికి కేటాయించిన రూముల్లో నిద్రిస్తూ కాలం గడిపేస్తుంటారు పైగా గని లోపల ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తి ఉత్పత్తికి ఆటంకం కలిగితే అక్కడ పనిచేసే కార్మికులను వేధించటానికి అక్రమచారి సీట్లు సస్పెండ్లు చేస్తూ వీళ్లు మాత్రం దర్జాగా కాలం గడిపేస్తూ లక్షల రూపాయలు జీతాలుగా పొందుతారు వీళ్లను కాపాడడం కోసం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల కు సంబంధించిన కొంతమందిని అనుచరులుగా నియమించుకొని కార్మికుల్ని వేధించటానికి ఉపయోగించుకుంటారు ఇలాంటి పరిస్థితి సింగరేణి గనుల్లో నెలకొంది హైదరాబాదులో ఉండే అధికారులకు సింగరేణిలో పనిచేస్తున్న అధికారుల విధివిధానాలు అర్థం కావు కాబట్టి వాళ్లు చెప్పిందే పై స్థాయి అధికారులు నమ్ముతూ కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం సింగరేణి వ్యాపితంగా కొనసాగుతుంది.

గాలి లేకపోయినా కాలి రాకపోయినా యంత్రాలు సతాయించిన గనిలోకి వెళ్లకుండానే అజమయిసి చేస్తూ కార్మికుల్ని వేధించడం కోసం అక్రమాచార్ సీట్లకు సస్పెండ్ లకు గురిజేయడం నిత్య కృత్యంగా సింగరేణిలో అమలవుతుంది సంస్కరణల పేరుతో కొంతమంది అధికారులు పనిచేసే కార్మికుల మీద అజమాయిషిని పెంచడమే తప్ప పని దొంగలను పట్టుకుని ప్రయత్నం చేయరనేది సింగరేణిలో సీనియర్ కార్మికులందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం మెడికల్ అండ్ ఫిట్ పేరు మీద లక్షల రూపాయలు దోచుకుంటున్న యూనియన్ నాయకులు పనిలో పనిగా సింగరేణి బొగ్గు గనుల్లోకి వెళ్లాల్సిన కార్మికుల పిల్లలను లక్షలాది రూపాయలు లంచాలు పుచ్చుకొని డిప్యూటేషన్ల పేరుమీద సంవత్సరాల తరబడి ఉపరితలంలో పెంచి పోషిస్తున్న సంగతి ఇటు సింగరేణి అధికారులకు యూనియన్ నేతలకు సయ్యాటగా మారిపోయింది ఇలాంటి గనుల్లో ఉత్పత్తిని పెంచడం కోసం తీవ్రనిర్బన్ధాన్ని అమలు చేసి ఉత్పత్తి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులను వేధించటమే అవుతుంది తప్ప పని దొంగలను మాత్రం నివారించలేరనేది గతం నుండి సీనియర్ కార్మికులందరికీ తెలిసిన విషయమే అన్ని డిపార్ట్మెంట్లలోనూ అవినీతి విలయతాండవం చేస్తుంది.

సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల పైరవీల ద్వారా సీనియర్ కార్మికులు మాత్రమే ఉత్పత్తికి ఉపయోగపడుతున్నారు జూనియర్ కార్మికులను లంచాలు తీసుకొని సంఘాల నాయకులే సర్ఫేస్ పని స్థలాలలో నియమిస్తున్నారంటే ఎంతటి ధర్మాన్ని కార్మిక సంఘాల నాయకులు కొనసాగిస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడైనా కార్పోరేట్ అధికారులు గనుల సందర్శనకు వచ్చినప్పుడు వాళ్లను నమ్మించటానికి గని పై పని చేసే అధికారులు పడరాని పాట్లు పడుతూ నానా యాగి చేసి మొత్తం గని ఆఫీసరాధీనంలోనే కొనసాగుతున్నట్లు నటించడం ప్రెస్ మీడియా వాళ్లని పిలిచి వీళ్లకు అనుకూలంగా వార్తలు గుప్పించడం అధికారి పోయిన తర్వాత నిత్యం జరుగుతున్న కార్యక్రమాన్ని కొనసాగించడం పరిపాటిగా మారింది.

సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల ఎన్నికల తంతు మొదలైన తర్వాత గెలిచిన సంఘాల నాయకులు జల్సాలకు అలవాటు పడి ఏ పని కావాలన్నా ధన బలంతోనే చేస్తూ సీనియర్ కార్మికులకు సైకిల్ సైకిల్ మోటార్ మాత్రమే దిక్కయితే పుణ్యానికి ఫ్రీ మస్టర్లు పొందుతున్న పైరవీలకు పాల్పడుతూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నా నాయకులు మాత్రం కార్లలో ఊరేగుతూ అవినీతి రాజ్యాన్ని యతెచ్చాగా సింగరేణిలో అమలు చేస్తున్నారు అధికారులు కూడా ఇలాంటి వాళ్ల జోలికి వెళ్లకుండా పనిచేసే కార్మికులను మాత్రమే వేధించటం సింగరేణి వ్యాప్తంగా పరిపాటిగా మారిపోయింది.

సింగరేణిని సంస్కరించడం అంటే సుఖాలకు అలవాటు పడ్డ అధికారులను మార్చడమే ఇదేమి పట్టని సింగరేణి యాజమాన్యం పాలిచ్చే బర్రెని రక్తం వచ్చేదాకా పాలు పితికినట్టు పనిచేసే కార్మికులను భయభ్రాంతులకు గురిచేసి ఉత్పత్తి సాధించడం వేధించడమే అవుతుంది తప్ప పని చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వాళ్లను నివారించటం చేస్తేనే సింగరేణి ఉత్పత్తి తీసినట్టు అవుతుంది తప్ప పని చేసే కార్మికులను మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురిచేసి ఉత్పత్తి తీయాలని విధానాన్ని యాజమాన్యం గుర్తించి మసలు కుంటే తప్ప సింగరేణి మనుగడ సాధ్యం కాదనే పై అధికారులు గమనించి గనుల పైన జరుగుతున్న వ్యవహారాన్ని చక్కదిద్ది గాలి సరఫరాకు చర్యలు చేపట్టేటట్టు అధికారులను పురమాయించి సరైన పనిముట్లను కమిషన్ల కోసం కక్కుర్తి పడి లోకల్ పర్చేస్ పేరుతో జరుగుతున్న అవినీతిని అరికట్టి మంచి పనిముట్లను కార్మికులకన్దించి గనుల్లో గాలి నీరు సరిపోయేంత కల్పించాలి తప్ప నిర్బంధం ద్వారా మానసిక వేధింపుల ద్వారా ఉత్పత్తిని సాధించాలని ఆర్డర్లు జారీ చేస్తే సరిపోదనేది కార్మికుల వనోగతం పై అధికారులు పేరుకు మాత్రం సంస్కరణలను చెబుతూ పని దొంగలను పెంచి పోషించినంత కాలం సింగరేణి సంస్థ అభివృద్ధి జరుగుతుందని గ్రహిస్తే భవిష్యత్తులో నూతన గనులు ప్రారంభించి ఉత్పత్తిని కొనసాగించాలని కార్మికులంతా గంపెడాశతో ఎదురుచూస్తున్నారు పుండు ఒకటైతే మందు ఒకటన్నట్టు సంస్థలో పుణ్యానికి మస్టర్లు పొందేటోళ్ళను నివారించనంత కాలం సింగరేణి కార్మికుల మీద నిర్బంధమ్ద్వారా ఉత్పత్తి సాధ్యపడదనే వాస్తవాన్ని పై స్థాయి అధికారులు గ్రహించాలని సింగరేణి కార్మిక వర్గం గంపెడ ఆశతో ఎదురుచూస్తుంది.

 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్