ప్రాంతీయం

శ్రీ చైతన్య గుర్తింపు ను రద్దు చేయండి

80 Views

నిర్మాణం జరుగుతున్న భవనంలో తరగతులు నిర్వహిస్తున్న “శ్రీ చైతన్య” గుర్తింపు ను రద్దు చేయండి..

వేల్పుల ప్రసన్నకుమార్,ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి,సిద్దిపేట

సిద్దిపేట జిల్లా జూన్ 22

సిద్దిపేట కేంద్రంలో షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా నిర్మాణం జరుగుతున్న భవనంలో తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం రోజున ఏఐఏస్ఎఫ్ సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో సిద్దిపేట మండల ఏంఈఓ యాదవరెడ్డి కి వినతిపత్రం అందజేశారు..

ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, షిఫ్టింగ్ పర్మిషన్ లేకున్నా కూడా పాఠశాలలను వేరే భవనాలకు బదిలీ చేస్తూ నూతనంగా నిర్మాణం అవుతున్న భవనాల్లో క్లాస్ లు నిర్వహిస్తున్నారని,4 అంతస్థుల భవనంలో కింది 2 అంతస్థుల్లో తరగతులు మరియు హాస్టల్ నిర్వహిస్తున్నారని మీది 2 అంతస్తులు నిర్మాణం జరుగుతుందని,అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి విద్యార్థులకు నష్టం జరిగితే ఎవరు బాధ్యులు అని అన్నారు.

వేల సంఖ్యలో అడ్మిషన్లు తీసుకుని కనీస సదుపాయాలు కల్పించడం లేదని,ఇరుకు ఇరుకు గదులలో విద్యా బోధన చేస్తున్నారని, విద్యార్థులు అడుకోవడానికి కనీసం ఆటస్థలము కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని వెంటనే విద్యా శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు..2,3 రోజుల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు..

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు చట్ల సమ్మయ్య, బాణోత్ నవీన్,సిద్ధుల సుమన్ లు ఉన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్