ప్రాంతీయం

రొట్టెలతో మోసపోయిన పిల్లులు _ ఆరగించిన కోతికథ…

104 Views

ముస్తాబాద్ జనవరి 1, అనగనగా రెండు పిల్లులు ఉండేవి, వాటికి ఒక రొట్టె దొరికింది. నాది అంటే నాది అని, నాకు ముందు దొరికిందని రెండు పిల్లులు పోట్లాడు తున్నాయి.పిల్లుల కొట్లాట ను చెట్టుపైనున్న కోతి చూస్తుంది. ఎంతసేపటికీ పిల్లుల కోట్లాట తగ్గలేదు. కోతి చెట్టు పై నుండి దిగి పిల్లుల వద్దకు వచ్చింది. ఎందుకు కొట్లాడుతున్నారు అని అడిగింది. అప్పుడు పిల్లులు రొట్టె గురించి చెప్పినవి.ఇంత చిన్న విషయానికి ఇంత గొడవపడుతున్నారా అన్నది కోతి.  నీ సమస్యకి నేను పరిష్కారము చెబుతాను చూడండి అన్నది కోతి. వెంటనే ఆ మాట విన్న పిల్లులు సరేనన్నా యి. కోతి వెంటనే ఈ రొట్టెను చెరిసగం పంచుకోండి. కావాలంటే నేనే మీకు పంచి ఇస్తాను అని అన్నది. అలాగే, నీవే పంచి ఇవ్వు అన్నవి పిల్లులు.  వెంటనే కోతి రొట్టెను రెండు ముక్కలుగా చేసింది. అయ్యో ఒక ముక్క పెద్దగా ఉన్నది, మీరు మళ్లీ పోట్లాడుతారు అంటూ రొట్టె ముక్కను కొరికింది కోతి. ఇప్పుడు మరో ముక్క పెద్ద గా ఉన్నది అంటూ వేరొక ముక్కను కొరికింది. ఈ ముక్క ఆముక్క పెద్దగా ఉన్నదంటూ రొట్టె మొత్తం తినేసి వెంటనే చెట్టు పైకెక్కి కూర్చుంది కోతి. పిల్లులు బిక్క మొహం వేసుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకొని బాధ పడ్డాయి. దొరికిన ఆహారం చేతులారా పోగొట్టుకున్నాము అనుకున్నాయి. ఈ అడవిలో  మోసాలు చేస్తున్న కోతిని గుర్తు చేసుకుంటేనే  నోరు, కళ్ళు, చెవులు మూసుకోవాల్సిందే  అనుకున్న పిల్లులు అంత భయం ఆపిల్లులకు… ఆ దొంగ కోతిని మన అడవిలోనే పట్టుకొని  వేరే దూరాపు అడవి ప్రాంతంలో ఆరోజుల్లో మనం వదిలేస్తే ఇలా రొట్టెలను ఆరగించేది కాదేమో అని బాధపడ్డ పిల్లులు… ఇలాంటికోతిదరికి మనం  వెల్లకూడదు దరికి రానివ్వకూడదు  తెలుసుకున్న నీతి కథ..

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్