157 Views
ముస్తాబాద్ జనవరి1,

గడిచిపోయిన2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ2023, నూతన సంవత్సర ఆరంభానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు న్యూఇయర్ వేడుకలు నిర్వహించి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ తల్లి కూడలిలో సందడి వాతావరణం కనిపించింది. ఉదయం 11.30 లకు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం సమీపంలో కార్యకర్తలు, నాయకులు అధిక మొత్తంలో చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకుని నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్య, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, అక్కరాజు శ్రీనివాస్, మాజీ ఏఎంసి చైర్మన్ శీలం జానాబాయి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కో ఆప్షన్ సాదుల్ పాప, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుర్రాల రమేష్ రెడ్డి, కొమ్ము బాలయ్య, మహిళా నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, బిఆర్ఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.