ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 9, మండేపల్లి గ్రామంలో బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి లబ్ధిదారులు పోతరాజు లచ్చవ్వ 10,000 ఏనుగుల అఖిల – రాము 24,000 లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసిఆర్ ,మంత్రి కే టి ఆర్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి చెక్కులను సర్పంచ్ శివజ్యోతి చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, రాగిపెల్లి కిష్టారెడ్డి, ఫయాజ్ గడ్డపురం రాము, గణప మహేష్ తదితరులు పాల్గొన్నారు.
