బంగ్లా వెంకటాపూర్ గ్రామస్టులకు భద్రాద్రి రామాయ్యా తలంబ్రాలు
పంపిణి చేసిన సంస్థ అధ్యకులు రామకోటి రామరాజు
ప్రతి సంవత్సరం అందుకోవడం మా అదృష్టం : గ్రామస్తులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ జూన్ 2
సిద్దిపేట జిల్లా గజ్వేల్ బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం రోజున భద్రాచల రామయ్యా ముత్యాల తలంబ్రాల పంపిణి శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో భక్తులందరికి తలంబ్రాల విశిష్టత తెలియజేసి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు అందజేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ గత సంవత్సరం కూడా ఈ గ్రామ ప్రజలకు అందజేయడం జరిగిందని ఈ సంవత్సరం కూడా నిత్య ఆంజనేయ సేవకుడు బాకి నర్సింహులు ఆధ్వర్యంలో
బంగ్లా వెంకటాపూర్ గ్రామస్తులకు అందజేశామన్నాడు. ఆ భద్రాచల ముత్యాల తలంబ్రాలు పొందడం అదృష్టం అన్నాడు.
ప్రతి సంవత్సరం ఆ భద్రాచల ముత్యాల తలంబ్రాలు పొందడం మా అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పుర ప్రముఖులు పాల్గొన్నారు.





