విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాలలో శనివారం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిపారు 2022 సంవత్సరం ముగుస్తున్నందున విద్యార్థులు పాఠశాలలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిన్నారులు చేసిన పలు సాంస్కృతిగా కార్యక్రమాలు నృత్యాలు అందరినీ అలరించాయి పలు వేషాధారణతో చిన్నారులు కార్యక్రమాన్ని ఆహ్లాదంగా సంతోషంగా సంబరాలు జరిపారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ లతీఫ్ మాట్లాడుతూ విద్యార్థులు సన్మార్గంలో నడుచుకుంటూ విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు నేర్పించిన క్లాస్ టీచర్లను అభినందించారు పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున సమయాన్ని వృధా చేయకుండా పదవ తరగతి విద్యార్థులు మంచిగా చదివి ప్రతి ఒక్కరూ 10 జిపి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు




