వర్గల్ మండల్ తునికికల్స గ్రామం అక్టోబర్ 18:రోటరీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
తునికీ కల్స్ గ్రామంలో రోటరీ క్లబ్ గజ్వేల్ అధ్యక్షులు బాబు గౌడ్, పూర్వ అధ్యక్షులు డాక్టర్ పురుషోత్తం, విద్యా కుమార్ గౌడ్ ల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
సందర్భంగా మాట్లాడుతూ పూలనే దేవతలుగా పూజించే తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగానే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నరు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదినీ ఇందులో భాగంగానే సాంస్కృతిక సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలోమెంబర్ అట్రాక్షన్, వాటర్ శానిటేషన్ చైర్మన్లు చంటి, కర్ణకర్ రెడ్డి, కార్యదర్శి నర్సింహ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ సంధ్య జాని, పూర్వ అద్యక్షులు నర్సిహ్మారెడ్డి, జగదీశ్వర్, నర్సిహ్మారెడ్డి, రోటరీ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో మహిళలు, జబర్దస్త్ టీం సభ్యులు వినోదిని, మోహన్ పాల్గొన్నారు.