ముస్తాబాద్ ప్రతినిధి, డిసెంబర్ 29, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పోలీస్ ఉద్యోగార్తులకు ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి గురువారం
ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈవెంట్ లో అర్హత సాదించిన ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు దరఖాస్తు చేసుకోవాలి. తరగతులు 04-01-2 023నుండి ప్రారంభం అవుతాయని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి ప్రకటన ద్వారా తెలిపాడు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నెంబర్:08723-223004, 9382888746 లో బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయం ఆఫీస్ వేళల్లో సంప్రదించవలసిందిగా కోరారు.




