దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ కు చెందిన గొల్ల లింగం గత కొన్ని రోజులుగా సోరియాసిస్ వ్యాధితో బాధపడుతుండగా బుధవారం బిఆర్ఎస్ యూత్ నాయకులు సయ్యద్ కలీలుద్దీన్ రూ 5వేలు, ముత్యం గారి స్వామి రూ.2 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నర్సింలు, శేఖర్, స్వామి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు..




