ప్రాంతీయం

రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి పంపిణీ జిల్లా అదనపు కలెక్టర్

37 Views

మంచిర్యాల జిల్లా

రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి పంపిణీ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య

అక్టోబర్ 30, 2025:
నిరుపేద, అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, నవంబర్ 1వ తేదీ నుండి చౌక ధరల దుకాణాలలో రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రేషన్ సన్న బియ్యం కొరకు ఒక వేలిముద్ర, నాన్ ఓవెన్ సంచి కొరకు ఒక వేలిముద్ర ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఏ చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డు కలిగి ఉన్నారో అక్కడ మాత్రమే వేలిముద్రతో నాన్ ఓవెన్ సంచి ఇవ్వబడుతుందని, పోర్టబిలిటీ విదానం ద్వారా ఇతర షాపులలో రేషన్ బియ్యం పొందే వారికి నాన్ ఓవెన్ సంచి ఇవ్వబడదని, రేషన్ కార్డుదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *