ప్రాంతీయం

బిఆర్ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి

100 Views

దౌల్తాబాద్: బిఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మాచిన్ పల్లి గ్రామంలో రూ.5 లక్షలతో ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి పథంలోకి తీసుకు పోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ యాదమ్మ, నాయకులు నాగరాజు, నర్సయ్య, రామచంద్రం, నాగరాజు, శాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
Jana Santhosh