Breaking News ప్రాంతీయం

సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు… చెదరని ఆత్మవిశ్వాసం ఆమె కవిత్వం.

134 Views

సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు…

చెదరని ఆత్మవిశ్వాసం ఆమె కవిత్వం.

సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం చిన్న భిన్నం చేసింది. ఎక్కడ చెదరని గుందేనిబ్బరం తో కాళ్ల ను చేతులుగా మలచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారు. చెదరని ఆత్మవిశ్వాసం తో రాజేశ్వరి ఎన్నో కవితలు.రాశారు.”సంకల్పం ముందు వైకల్యం ఎంత! దృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత! ఎదురీత ముందు విధిరాత ఎంత. పోరాటం ముందు ఆరాటం ఎంత.రాజేశ్వరి రాసిన కవిత ను గమనిస్తేఆమె అక్షరాల పదును అర్థమవుతుంది. రాజేశ్వరి రాసిన కవితలను సుద్దాల ఫౌండేషన్ సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో కవిత సంకలనాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2014 లో వచ్చిన ఈ కవిత సంకనానికి జీవితమే కవిత్వం అంటూ ముందుమాట రాస్తూ డాక్టర్ శీలాలోలిత చివర్లో చెప్పిన మాటలు “బతుకుతున్నాం బాధపడుతున్నం అంతవరకే కానీ అమే
మాత్రం జీవిస్తుంది అనుభవిస్తుంది. అనుభవల నుంచి వచ్చింది రాజేశ్వరి కవిత్వం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజేశ్వరి బుధవారం శాశ్వతంగా నిష్క్రమించారు. సిరిసిల్ల ప్రాంతం నుంచి వైకల్యాన్ని సైతం ధిక్కరించి ఆత్మవిశ్వాసపు అక్షరలను కవిత్వంలో ఆవిష్కరించిన సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7