సరిపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయి
జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్
దౌల్తాబాద్: యాసంగి సీజన్లో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఫర్టిలైజర్ షాపులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, బిల్లుల పైన రైతు సంతకం తీసుకోవాలని అన్నారు. నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని యాజమాన్లకు సూచించారు. మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు, అనంతరం వ్యవసాయ అధికారి కార్యాలయాన్నీ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పంట నమోదు చేయాలని ఏఈఓ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు, ఏఈఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు…