కెసిఆర్ దత్తత గ్రామం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
హాజరుకానున్న రాష్ట్ర ముఖ్య నాయకులు
నవంబర్ 20
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం నర్సన్నపేట గ్రామంలో లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి ముఖ్యమైన నేత ఒకరు వస్తున్నారని గ్రామ పార్టీ అధ్యక్షుడు ఊడెం తిరుపతి రెడ్డీ ఓ ప్రకటనలో తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్బంగా తిరుపతి రెడ్డీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం దిశగా అడుగులు వేసి,రాష్ట్రంలో పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం అని తెలిపారు.





