ముస్తాబాద్, నవంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి)తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు మండలంలో ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం నుండి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు గ్రామపంచాయతీలో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బూత్ లెవెల్ వారీగా ప్రజలు తమ
ఓటు హక్కును కొన్ని గ్రామాలలో ఇబ్బందిగా ఉన్న ఆలస్యంగా వినియోగించుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లను తమ పార్టీలకు ఓట్లు వేయాలని ఎన్నికల బూత్ ల వద్ద ఓటరులను అభ్యర్థించారు. మధ్యాహ్నం సమయంలో అధిక సంఖ్యలో ప్రజలు ఓట్లు వేసేందుకు బార్లు తీరగా సాయంకాలం సమయం వరకు పూర్తిగా ప్రజలు ఓటును వినియోగించుకున్నారు. ఇంకొందరు ఓటర్లు సమయానికి చేరుకోలేక తమఓటు వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. మరికొందరు ఓట్లు వేయడానికి హాజరు కాకపోగా మరికొందరి ఓట్లుగల్లంతు అయ్యావని సహనం కోల్పోయారు. ఎట్టకేలకు వృద్ధులు వికలాంగులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. స్థానిక పోలీసులు ఎన్నికల కేంద్రాల వద్ద భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే గ్రామపంచాయతీ అధికారులతో పాటు పంచాయతీ సిబ్బంది సహకరించారు. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సజావుగా జరిగాయి.




