రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని నర్మాల గ్రామం లో ని హార్వెస్ట్ చర్చి మానేరు క్యాంపు , శ్రీగాధ, దమ్మన్నపేట్ మరియు అన్ని గ్రామాలలో క్రైస్తవుల ఆరాధ్యదైవమైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించడానికి ప్రార్థన మందిరాలు ముస్తాబయ్యాయి. క్రిస్మస్ యొక్క ప్రత్యేకత విశిష్టతను వివరిస్తూ క్రైస్తవులు తమ ప్రార్థనా మందిరాల కు వెళ్లి ప్రార్థనలు జరిపిస్తారు లోకకళ్యాణం కోసం ఏసుక్రీస్తు సిలువ పై తన ప్రాణాలను బలి గా అర్పించాలని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పటికే క్రైస్తవులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా విందు భోజనం ,లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు క్రిస్మస్ జన్మదినము పురస్కరించుకొని చిన్న పిల్లల నాటికలు సాంస్కృతిక నృత్యాలతో అలరించనున్నారు మండల కేంద్రంలోని అన్ని క్రైస్తవ ప్రార్థన మందిరాలు రంగు రంగులుగా అలంకరించబడ్డ.నక్షత్రం యొక్క విశిష్టత: యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఒక తోక చుక్క ఆకాశములో వెలసి జ్ఞానులకు చూపించిందని బైబిల్ లో వ్రాయబడింది ప్రపంచంలో వెలుగులు నింపిన ఏసుక్రీస్తు తమ ఇంటిలో కూడా వెలుగులు నింపాలని క్రైస్తవులు నక్షత్రాన్ని తమ ఇళ్లపై అలంకరిస్తారు.
