ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 2, కార్మికుల హక్కులకోసం 14 ఫిబ్రవరిన చలో హైదరాబాద్ కరపత్రాల ఆవిష్కరణ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీడీ కార్మికుల బతుకులు మారుతాయని ఉద్యమ సమయంలో కెసిఆర్ అన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు బీడీ కార్మికులకు కనీస వేతన జీవోను విడుదల చేయలేదు. జీఎస్టీ మీటింగ్లలో కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులకు తలఊపి రాష్ట్రంలో మాత్రం ఈపన్నును వ్యతిరేకిస్తున్నామని చెప్తూ కార్మికులను మోసం చేస్తుంది. సి ఓ పి టి ఏ చట్టం, ఇపీఎఫ్ వొ ద్వారా జిఎస్ ఆర్ 226 (ఇ) 2015 పిఎఫ్ సర్వీస్ క్యాంట్రిబ్యూటరీ సర్వీస్ అంటూ 20 ఏళ్లు పనిచేసిన పింఛన్ రాకుండా కార్మిక సంఘాలను సంప్రదించకుండానే జివొ లు తీసింది. ఇఎస్ ఐ సమస్యలు కార్మికుల సంబంధించిన పలు సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం దృష్టికి మన కార్మిక సమస్యలను తీసుకపోవడానికి (బిఎంఎస్) భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈర్యాలీ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీడీ కార్మికులందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని (బిఎంఎస్) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్ పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ముస్తాబాద్ మండలంలో ఉన్న దేశాయి బీడీ కంపెనీలో బీడీ కార్మికుల చేతులమీదుగా చలో హైదరాబాద్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో (బిఎంఎస్) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, చంద్రమౌళి, మచ్చ ప్రవీణ్, తడుక ప్రభాకర్, ముచ్చర్ల నరేశ్, కోంక రాజు, శ్రీనివాస్, నగేష్, సకినాల పద్మ, లత, బీడీ కార్మికులు పాల్గొన్నారు.
