దౌల్తాబాద్,సెప్టెంబర్ 16: దుబ్బాక నియోజకవర్గం లో డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకున్న వారికి దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఉచిత లైసెన్స్ అందజేస్తున్నామని బిజెపి మండల ఉపాధ్యక్షుడు గడ్డమీది స్వామి అన్నారు. శనివారం మండల పరిధిలోని ఇందుప్రియల్, చెట్ల నర్సంపల్లి, మాచిన్ పల్లి గ్రామాలకు చెందిన 67 మంది యువకులకు లర్నింగ్ లైసెన్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ను అభివృద్ధి చేయడంతో పాటు తన సొంత నిధులతో దుబ్బాక నియోజకవర్గం ఉచితంగా లైసెన్సులు అందజేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఆసక్తి గల మహిళలకు డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చి లైసెన్సులు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సత్తయ్య, మహేష్ చారి, సాయి, నాగులు, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు…..
