ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల ఇంచార్జ్ లింగాల సంధీప్ ఆధ్వర్యంలో సిరిసిల్ల సింహ గర్జన భారీ బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఈసి మెంబర్ హజరైనారు.
ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ లింగాల సందీప్ మాట్లాడుతూ నవంబర్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాలేజీ గ్రౌండ్ లో సిరిసిల్ల సింహగర్జన సభను బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇట్టి సభకు మన సుప్రీం పేరు తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విచ్చేయుచున్నారు కావున మండల కేంద్రంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, బహుజన విశ్లేషకులు లతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ అగ్రవర్ణ పేదలు భారీ బహిరంగ సభను లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలి అని అన్నారు.
