మూడుసార్లు సర్వసభ్య సమావేశం బహిష్కరించిన సమావేశం నుంచి ఎంపీటీసీలు వెళ్లిన ఏ ఒక్క రోజైనా పిలిచి మాట్లాడకుండా ఉండడం ఎంపీటీసీలను అగౌరపర్చినట్లు కాదా అని మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సత్యనారాయణ మిగతా ఎంపిటీసీలతో కలసి నార్సింగి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు. జడ్పిటిసి ఒక ప్రొసీడింగ్ కాఫీ ఇచ్చినంత మాత్రాన ప్రోటోకాల్ పాటించలేదని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎంపీపీ సబితకో న్యాయం ఎంపీటీసీలకో న్యాయమా మేము ప్రజాప్రతినిధులముకామ అని వారు ప్రశ్నించారు. ఎన్నోసార్లు జెడ్పిటిసిని,ఎంపీటీసీలను అగౌరపరిచినప్పుడు గుర్తుకు రాని ప్రోటో కాల్ జడ్పిటిసి ప్రొసీడింగ్ కాఫీ ఇవ్వగానే ఫ్రొటో కాల్ గుర్తు వచ్చిందా అని, ఎంపీటీసీల వ్యక్తిగత కక్షలు ఏమిటో బయట పెట్టాలని ఎంపీటీసీలు గా మేము ఎంపీపీ ని ,డిమాండ్ చేస్తున్నామని,ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాల ను మానుకోవాలని వారు ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో నార్సింగి ఎంపిటిసి 2 ఆకుల సుజాత మల్లేష్ గౌడ్,వైస్ ఎంపిపి సుజాత,శేరిపల్లి ఎంపిటిసి సంతోష తదితరులు పాల్గొన్నారు.
