నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు అందజేత
– పేద కుటుంబాలకు అండగా మామిడి మోహన్ రెడ్డి
– పేదల సంక్షేమ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మోహన్ రెడ్డి
నిరుపేద సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతూ నిరుపేద వధువులకు పుస్తె మట్టలు అందజేయడంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ముందడుగు వేసి నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం లక్ష్యంగా దుబ్బాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. చేసే సేవా కార్యక్రమాలను చూసి వివిధ గ్రామ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట కౌన్సిలర్ బంగారయ్య మామిడి మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నూతన వధువుకు పుస్తె మట్టలు అందజేశారు. లచ్చ పేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన బెల్లపు రమేష్ ఎల్లవ్వ కూతురు శ్రావణి వివాహానికి గురువారం పుస్తె మట్టలు అందజేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా నిరుపేద కుటుంబాల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే లక్ష్యంగా మామిడి మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నాడని పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి నిరుపేద కుటుంబాలకు పేదింటి ఆడపడుచులకు పుస్తె మట్టెలను అందజేశారని వారు గుర్తు చేశారు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయాలను అందిస్తూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని వారు అన్నారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల అమరులు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సీఎం కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించారని ఇందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల సీఎంలు సీఎం కేసీఆర్ను అభినందించారని గుర్తు చేశారు. తమకు పదవులు ఉన్నా లేకున్నా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు రాంప్రసాద్ గౌడ్, తుడుం ప్రశాంత్, శ్రీనివాస్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.