మంచిర్యాల జిల్లా.
బిజెపిలో చేరిన మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్.
నేడు మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ మరియు సీనియర్ నాయకులు బెల్లంకొండ మురళి బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ముఖేష్ గౌడ్ మరియు మురళి కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, జయ రామ రావు, రవీందర్ రావు, అధినాథ్ పాల్గొన్నారు.
గాజుల ముకేష్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం లోని మంచిర్యాల జిల్లా మంచిర్యాల టౌన్ యువ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ లో నాటి టీ డీ పీ ఎంఎల్ఏ కీ .శే. హనుమత్ రావు నాయకత్వం లో రాజకీయ రంగా ప్రవేశం చేసి మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సంగం కోశాధికారి గా చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు పెంచుకొని మంచిర్యాల పట్టణ తెలుగుదేశం యువత అధ్యక్షునిగా టీడీపీ లో పార్టీ బాధ్యతలు చేపట్టి అంకిత భావం తో ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తూ మంచిర్యాల మున్సిపాలిటీ లో రెండు సార్లు కౌన్సిలర్ గా ప్రాతినిధ్యం వహిస్తూ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఎన్నుకో బడగా పట్టణంలో మరియు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో నాయకుడిగా మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు మరియు కార్మిక, కర్షక ప్రత్యక్షంగా అసంఘటిత కార్మిక సంఘాల నాయకునిగా నిరంతరం సేవలు అందిస్తున్న అదే విధంగా రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సేవ సంస్థలో నాయకునిగా బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కొరకు పాటు పడుతూన్నారు. భారత దేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాలకు ధీటుగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ముందు సాగిస్తున్న ఏకైక నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ లక్షణాలకు మరియు దేశ లో పేద కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు నాయకత్వంలో బీజేపీ పార్టీ లో చేరి దేశ బీజేపీ నాయకుల సమక్షంలో పార్టీలో చేరి మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ పటిష్టానికి అంకిత భావంతో పనిచేయుటకు జిల్లా పార్టీ అధ్యక్షులు రఘునాథ్ ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయ ఆశయలు కటుబడి ఉంటానని ప్రజా సేవకు సేవకునిగా పని చేస్తానని ముఖేష్ గౌడ్ తెలియజేశారు.





