జగదేవపూర్ లోని హనుమాన్ భక్త మండలికి, పీర్లపల్లి గ్రామంలో హనుమాన్ భక్త మండలికి శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో భద్రాచల దేవస్థానం ముత్యాలను తలంబ్రాలను శుక్రవారం హనుమాన్ దేవాలయల వద్ద భక్తులకు అందజేయడం జరిగింది. పీర్లపల్లి గ్రామం నుండి కొడగట్టుకు 2వ సారి పాదయాత్ర చేసి తిరిగివచ్చిన బాలింగుల నరేష్ కుమార్ ను శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యకులు రామకోటి రామరాజు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రామనామం తోడుంటే సాధించనిది ఈరోజు ప్రపంచంలో ఏది లేదన్నాడు. బాలింగుల నరేష్ కుమార్ ఆణువణువున రామనామాన్ని నింపుకొని కొండగట్టుకు పాదయాత్ర చేయడం యువతకు స్ఫూర్తిదాయకం అన్నాడు. ఇలాంటి యువత దేశానికి ఏంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో పీర్లపల్లి మాజీ ఎంపిపి సుదర్శన్ రెడ్డి, పీర్లపల్లి మాజీ సర్పంచ్ యాదిరెడ్డి, పాపిరెడ్డి, మైపాల్ రెడ్డి, తుక్కారామ్, వెంకటేశం గౌడ్, హనుమాన్ భక్త బృందం పాల్గొన్నారు.