బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ తల్లి సంరక్షణ కోసం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళిమహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు కెసిఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టామన్నారు. పేద మహిళల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ న్యూట్రిషన్ కిట్ రూపొందించారని వెల్లడించారు. తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్ను ఇస్తున్నామని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తున్నామన్నారు. గర్భిణులకు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ కిట్ను కాబోయే తల్లులు మాత్రమే వినియోగించాలని సూచించారు.
తల్లీ, బిడ్డ బాగుండాలని న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామని చెప్పారు. ఇందులో ప్రొటీన్ డైట్ ఉంటుందన్నారు. ప్రతి కిట్ విలువ రూ.2 వేలు ఉంటుందని వెల్లడించారు. ప్రతి గర్భిణికి రెండుసార్లు న్యూట్రిషన్ కిట్ అందిస్తామన్నారు. తల్లీబిడ్డల క్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. పౌష్టికాహార కిట్తో తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.




