దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్వామివారికి 11 రకాల 108 లీటర్ల తో మహాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈనెల ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి మహాభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మాధవి, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పబ్బ అశోక్ గుప్తా, పట్టణ అధ్యక్షుడు గంప రవి, ఆలయ కమిటీ నిర్వాహకులు రామ్ గోపాల్ రావు, శివరాములు, జిల్లా అంజయ్య, వీరేశం, శ్రీశైలం, ఐత వీరేశం, సంబరపు నర్సింలు, సంజీవరెడ్డి, అంజయ్య, కృష్ణ, సిద్ధి రాములు, కిషన్, ఆంజనేయులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
