ముస్తాబాద్ డిసెంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిధి) ప్రకృతిలో తాటి, ఈతచెట్ల నుంచి సహజ పద్ధతుల్లో సేకరించే కల్లులో పోషకాలు ఉంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పరిమితంగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగానూ పనిచేస్తుందని ప్రముఖ జర్నల్స్ ప్రచురించాయి. ఎంతో మంది కల్లుగీత వృత్తిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. తరాల నుండి తెర్లుమద్ది, బట్టోనితాళ్లు తండాలో గీతా కార్మికులు తమకులవృత్తి నమ్ముకుని జీవనం సాగిస్తున్కనారు. కల్లును నమ్ముకుని 30 కిలోమీటర్లమెర పైచిలుకు తదితర గ్రామాల నుండి కళ్ళు సేవించాలని వస్తున్నారు. అయితే వారి నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని గౌడసంఘం స్వచ్ఛమైన కళ్ళు విక్రయించాలని కల్తీ అమ్మినవారికి జరిమానా విధించాలని ఓనిర్ణయం చేసుకున్నామన్నారు. ఆనిర్ణయాన్ని ధిక్కరించి అమాయక ప్రజలను నమ్మించి కల్లును కల్తీచేసి విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్న గౌడును సంఘం నాయకులు జరిమాన విధించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.




