ప్రాంతీయం

పెద్దదిక్కులు కోల్పోయిన కుటుంబాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకున్న మిత్రునికి తోచిన సహాయాన్ని అందించారు…

213 Views

ముస్తాబాద్ ప్రతినిధి జూలై 8, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో1987 సంవత్సరం వరకు కలిసి చదువుకున్న తోటి మిత్రుడు మల్కాపేటకు శాదుపల్లి శ్రీనివాస్ గౌడ్ గత 22రోజుల క్రితం గుండె పోటుతో పరమపదించాడు. శ్రీనివాస్ ఇక లేడని జీర్ణించుకోలేని ఆయన తండ్రి లక్మి నారాయణ గత 11 రోజుల క్రితం మరణించాడు. ఇంటికి పెద్దదిక్కులిఇద్దరు పరమపదించడంతో కుటుంబం రోడ్డునపడ్డది. శ్రీనివాస్ కు అంగవైకల్యం కలిగిన కుమారుడు అరవింద్, డిగ్రీ చదువుతున్న అర్చన కూతురు కలరు. సమాచారం అందుకున్న 1986-87 కు చెందిన పూర్వ విద్యార్థులు వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేసుకొని వారికి తోచినంత సహాయాన్ని 62.వేలరూ నగదును భార్య పద్మకు అందించారు. రానున్న రోజుల్లో మిత్రులం అండగా నిలుస్తామని వెల్లడించారు. తోటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగానిలుస్తామనడంతో కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ కార్యక్రమంలో కుక్కల దేవేందర్, పార్వతి హరికృష్ణ, అక్క పెళ్లి యాదగిరి గౌడ్, ఎనుగందుల శంకర్, బొంపల్లి శ్రీనివాస్, మదికొండ నారాయణ తోటి మిత్రులు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *