సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డు లో సోమవారం నూతనంగా ఎన్నికైన గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కీర్తి శేషులు హకీమ్ కుటుంభానికి 25 వేలు ఆర్థిక సహాయం అందజేశారు, వర్గల్ సరస్వతి అమ్మవారి దేవాలయానికి ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయల చెక్కు వర్గల్ సరస్వతి దేవాలయం కమిటీ సభ్యులకు అందజేశారు,అలాగే బూరుగు పల్లి గ్రామానికి అంబులెన్స్ అందజేస్తున్నట్లు, గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా ఊడెం కృష్ణారెడ్డి తెలిపారు ఈసందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు