ప్రాంతీయం

నవోదయ,లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల…

439 Views

ముస్తాబాద్, జూలై 20 (ప్రభన్యూస్): నవోదయ విద్యాలయాల్లో 6.వ త‌ర‌గ‌తి ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ 17న విడుద‌లైంది. అలాగే 2025.26 విద్యా సంవత్సరానికి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభ‌మైందనీ సంబధిత శాఖ అధికారులు తెలిపారు. ఈ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌కు చివ‌రి తేదీ సెప్టెంబర్ 16.తేదీఅనీ 5.వ త‌ర‌గ‌తి చదువుతున్న విద్యార్థులు ఈ దరఖాస్తుకు అర్హులని తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు 01.05.2013 నుంచి 31.07.2017 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో 3,4,5 తరగతులు చదివి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీలోగా పాఠశాల సంబంధిత అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రవేశ పరీక్ష తేదీ 18.01.2025న ఉంటుంది అనీ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found