- పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు గజ్వేల్ పోలీసుల దాడి
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ అక్టోబర్ 3
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రామం ఎంబారి రామచంద్రం రియల్ ఎస్టేట్ ఆఫీసులో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, గజ్వేల్ పోలీసులు వెళ్లి రైడ్ చేసి 06 గురు వ్యక్తులు కలసి పేకాడుతుండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 77,180/- వేల రూపాయలు, 06మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.
గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
పేకాట ఆడిన వారి వివరాలు
1 ఎంబారి రామచంద్రం
2 ఎల్డండి వెంకట్ రెడ్డి
3 తాటికొండ బలరాం రెడ్డి
4 గడీల కర్ణాకర్ రెడ్డి
5 చేతిరెడ్డి చిన్నారెడ్డి
6 వి రమేష్
అందరి నివాసం గజ్వేల్ పట్టణం
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది
