దౌల్తాబాద్: మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో నీరుడి పెంటయ్య అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం ట్రస్టు సభ్యులు తలారి నర్సింలు, స్వామి గౌడ్ లు పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం లో నిరుపేదలకు ఏ ఆపద వచ్చిన ఎమ్మెన్నార్ ట్రస్ట్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నగేష్, నాయకులు గడ్డమీద సత్తయ్య, కన్నా రెడ్డి, బొటుక సత్తయ్య, నీరుడి సత్తయ్య, రమేష్, నర్సింలు, రాజు తదితరులు పాల్గొన్నారు..
