పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని వీరారెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు పాపని ఆంజనేయులు అన్నారు. శుక్రవారం దుబ్బాకలో మంత్రి వివేక్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లతో పేద ప్రజల ముఖంలో సంతోషం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాలయ్య, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు శాతం రాము, తదితరులు పాల్గొన్నారు
